Jayam serial: గంగ కోసం ఆ పని చేసిన రుద్ర.. వీరుపై శకుంతల ఫైర్!
on Dec 23, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -148 లో.. గంగని నమ్మనందుకు రెగ్రీట్ గా ఫీల్ అవుతాడు రుద్ర. గంగ త్వరగా కోలుకోవాలని దేవుడికి మొక్కుకుంటాడు. మరొకవైపు వీరు ఫుడ్ ఫెస్టివల్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు నువ్వు చేసుకున్నావ్ ఇంత పెద్ద తప్పు ఎలా జరిగిందని వీరుపై శకుంతల కోప్పడుతుంది.
మరొకవైపు రాత్రంతా నిద్రపోకుండా రుద్ర, గంగ పక్కనే ఉంటాడు. గంగ స్పృహలోకి రాగానే రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా కోసం మీరు ఇంత చేశారు చాలా థాంక్స్ అని గంగ అంటుంది. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు అందులో విషం ఉందని నిరూపించడానికి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవాలా అని రుద్ర అంటాడు. మరి నాకు వేరే దారి కన్పించలేదు సర్ అని గంగ అంటుంది. ఆ తర్వాత గంగకు అన్ని టెస్ట్ లు చేసి డిశ్చార్జ్ చెయ్యడానికి రుద్రకి ఫామ్ ఇస్తారు. అందులో పేషెంట్ కి ఉన్న సంబంధం ఏంటని ఉంటుంది. అక్కడ రుద్ర ఆలోచిస్తాడు. మీరు సర్, నేను ఎంప్లాయి కదా అని గంగ అంటుంది కానీ రుద్ర హస్బెండ్ అని రాస్తాడు. అలా ఎందుకు రాసారని గంగ అనగానే.. ఏ నీ భర్తని కాదా అని రుద్ర అంటాడు. అంటే మీరు ఏం చెప్పినా అడ్డుచెప్పొద్దా అని గంగ అంటుంది.
ఆ తర్వాత వదినని మన ఇంటికి తీసుకొని వెళదామని వంశీ అనగానే.. వద్దు మా ఇంటికి వెళతానని గంగ అంటుంది. అవసరం లేదు మన ఇంటికి తీసుకొని వెళదామని రుద్ర అంటాడు. మరుసటిరోజు ఉదయం రాత్రంతా నిద్ర మానుకొని గంగ కోసం లక్ష్మీ చూస్తుంది. అప్పుడే శ్రీను వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. పోనీలే గంగని ఇప్పటికైనా తన ఇంటికి తీసుకొని వెళ్లారని లక్ష్మీ అనుకుంటుంది. మరొకవైపు గంగ గురించి శకుంతల తప్పుగా మాట్లాడుతుంటే గంగ మన కోసం త్యాగం చేసింది. అది గుర్తించకుండా ఇలా అంటావేంటని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



